Skip to content

హోషేయ 9:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 9:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.

హోషేయ 9 TELUBSI

హోషేయ 9:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా దేవుని దగ్గర ఉండే ప్రవక్త ఎఫ్రాయిముకు కావలివాడు. వారి దారులన్నిటిలో పక్షులకు పన్నే వలలు ఉన్నాయి. దేవుని మందిరంలో వారి పట్ల శత్రుత్వం ఉంది.

హోషేయ 9 IRVTEL

హోషేయ 9:8 TERV (పవిత్ర బైబిల్)

దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కాని మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించుకొంటున్నారు.

హోషేయ 9 TERV

హోషేయ 9:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.

హోషేయ 9 TSA