హోషేయ 9:7
హోషేయ 9:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.
హోషేయ 9:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శిక్షా దినాలు వచ్చేస్తున్నాయి. ప్రతికార దినాలు వచ్చేశాయి. “ప్రవక్తలు బుద్ధిలేని వారు, ఆత్మ మూలంగా పలికే వారు వెర్రివారు.” ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలువారు ఇది తెలుసుకుంటారు.
హోషేయ 9:7 పవిత్ర బైబిల్ (TERV)
“ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు.