Skip to content

హోషేయ 7:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 7:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు.

హోషేయ 7 TELUBSI

హోషేయ 7:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.

హోషేయ 7 IRVTEL

హోషేయ 7:4 TERV (పవిత్ర బైబిల్)

రొట్టెలు చేసేవాడు రొట్టె చేసేందుకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.

హోషేయ 7 TERV

హోషేయ 7:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.

హోషేయ 7 TSA