హోషేయ 4:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 4:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.
హోషేయ 4:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు. ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు. ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే.
హోషేయ 4:4 TERV (పవిత్ర బైబిల్)
ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్దు.
హోషేయ 4:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయితే ఏ ఒకరిపై నేరం మోపకండి, ఏ ఒక్కరు ఇంకొకరిని నిందించకండి, ఎందుకంటే మీ ప్రజలు యాజకుని మీద నేరం మోపుతారు.