హోషేయ 4:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 4:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్రమత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.
హోషేయ 4:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
హోషేయ 4:3 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
హోషేయ 4:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; అడవి జంతువులు, ఆకాశపక్షులు, సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.