Skip to content

హోషేయ 2:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 2:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను.

హోషేయ 2 TELUBSI

హోషేయ 2:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.

హోషేయ 2 IRVTEL

హోషేయ 2:8 TERV (పవిత్ర బైబిల్)

“ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు.

హోషేయ 2 TERV

హోషేయ 2:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.

హోషేయ 2 TSA