హోషేయ 12:2-4
హోషేయ 12:2-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు. తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు. అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు.
హోషేయ 12:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు.
హోషేయ 12:2-4 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు.
హోషేయ 12:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరికలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను