Skip to content

హోషేయ 12:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 12:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును.

హోషేయ 12 TELUBSI

హోషేయ 12:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు.

హోషేయ 12 IRVTEL

హోషేయ 12:2 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి.

హోషేయ 12 TERV

హోషేయ 12:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు.

హోషేయ 12 TSA