ఆదికాండము 39:21-23
ఆదికాండము 39:21-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా అతనితో ఉన్నారు; ఆయన అతనిపై దయ చూపించారు, చెరసాల అధికారి దృష్టిలో అతనిపై దయ కలిగించారు. కాబట్టి చెరసాల అధికారి చెరసాలలో ఉన్నవారందరిపై యోసేపుకు అధికారం ఇచ్చాడు, అక్కడ జరిగే అంతటి మీద అతనికి బాధ్యత అప్పగించాడు. చెరసాల అధికారి యోసేపు ఆధీనంలో ఉన్నవాటి గురించి చింతించలేదు, ఎందుకంటే యెహోవా యోసేపుతో ఉన్నారు, అతడు చేసే అన్నిటిలో విజయాన్ని ఇచ్చారు.
ఆదికాండము 39:21-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.
ఆదికాండము 39:21-23 పవిత్ర బైబిల్ (TERV)
అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయను చూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్లయ్యేటప్పటికి చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది. కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు, అయినప్పటికీ వారు చేసిన పనులే అతడు కూడా చేశాడు. చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను ఆ కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్లు యెహోవా యోసేపుకు సహాయం చేశాడు.
ఆదికాండము 39:21-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణచేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.