ఆదికాండము 39:11-12
ఆదికాండము 39:11-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు. ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు.
ఆదికాండము 39:11-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.
ఆదికాండము 39:11-12 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. ఆ తొందరలో అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేశాడు.
ఆదికాండము 39:11-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.