ఆదికాండము 24:3-4 - Compare All Versions

ఆదికాండము 24:3-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.

షేర్ చేయి
ఆదికాండము 24 TSA

ఆదికాండము 24:3-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో ‘భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు’ అని ప్రమాణం చేయిస్తాను” అని అతనితో అన్నాడు.

షేర్ చేయి
ఆదికాండము 24 IRVTEL

ఆదికాండము 24:3-4 TERV (పవిత్ర బైబిల్)

ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వనని భూమ్యాకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు. నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”

షేర్ చేయి
ఆదికాండము 24 TERV

ఆదికాండము 24:3-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

షేర్ చేయి
ఆదికాండము 24 TELUBSI