ఆదికాండము 21:17-18
ఆదికాండము 21:17-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు. నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.
ఆదికాండము 21:17-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు. ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు.
ఆదికాండము 21:17-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు. నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.
ఆదికాండము 21:17-18 పవిత్ర బైబిల్ (TERV)
ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.”
ఆదికాండము 21:17-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.