ఎజ్రా 10:1 - Compare All Versions

ఎజ్రా 10:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు.

షేర్ చేయి
ఎజ్రా 10 TSA

ఎజ్రా 10:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.

షేర్ చేయి
ఎజ్రా 10 IRVTEL

ఎజ్రా 10:1 TERV (పవిత్ర బైబిల్)

ఎజ్రా ఎడతెగకుండా శోకిస్తూ, ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని ఆలయం ముందు విలపిస్తూ సాష్టాంగపడ్డాడు. ఎజ్రా అలా ప్రార్థిస్తూ వుండగా, ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. వాళ్లు కూడా భోరున విలపించసాగారు.

షేర్ చేయి
ఎజ్రా 10 TERV

ఎజ్రా 10:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా

షేర్ చేయి
ఎజ్రా 10 TELUBSI