యెహెజ్కేలు 9:1-3 - Compare All Versions
యెహెజ్కేలు 9:1-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన గట్టిగా ఇలా మాట్లాడడం నేను విన్నాను, “మీలో ప్రతి ఒక్కరు తమ చేతిలో ఆయుధం పట్టుకుని పట్టణం మీద తీర్పును అమలుచేయడానికి నియమించబడిన వారిని దగ్గరకు తీసుకురండి.” ఉత్తరాన ఉన్న పై ద్వారం వైపు నుండి ఆరుగురు వ్యక్తులు తమ చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని రావడం నేను చూశాను. వారితో పాటు నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వారు లోపలికి వచ్చి ఇత్తడి బలిపీఠం ప్రక్కన నిలబడ్డారు. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ అది ఉన్న కెరూబు మీది నుండి పైకి వెళ్లి ఆలయ గడప దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు యెహోవా నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉన్న వానిని పిలిచి
యెహెజ్కేలు 9:1-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను వింటుండగా దేవుడు పెద్ద స్వరంతో ఇలా ప్రకటించాడు. “పట్టణాన్ని కాపలా కాసే వాళ్ళంతా ఇక్కడికి రండి. ప్రతి ఒక్కడూ నిర్మూలం చేసే తన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని రావాలి” ఇదిగో చూడండి! ఉత్తరం వైపున ఉన్న ముఖద్వారం నుండి ఉన్న దారిలో ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సంహారం చేసే ఆయుధం ఉంది. వారి మధ్యలో నారతో నేసిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని నడుముకి లేఖకుడి వ్రాత సామాను ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఇత్తడి బలిపీఠం దగ్గర నిలబడ్డారు. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.
యెహెజ్కేలు 9:1-3 TERV (పవిత్ర బైబిల్)
పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయుధం కలిగి ఉన్నాడు. పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు ధరించాడు. అతని నడుముకు లేఖకుని కలం, సిరాబుడ్డి వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.
యెహెజ్కేలు 9:1-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెను–ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని–పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొ కడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా