ఎస్తేరు 9:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 9:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా
ఎస్తేరు 9:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అహష్వేరోషు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లోని యూదులందరికీ ఉత్తరాలు వెళ్ళాయి.
ఎస్తేరు 9:30 TERV (పవిత్ర బైబిల్)
మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు.
ఎస్తేరు 9:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహష్వేరోషు సామ్రాజ్యంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరికి క్షేమం, నమ్మకం కలిగించే మాటలతో కూడిన ఉత్తరాన్ని మొర్దెకై పంపాడు.