ఎస్తేరు 8:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 8:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
ఎస్తేరు 8:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ “అగగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి” అని కన్నీటితో అతణ్ణి వేడుకుంది.
ఎస్తేరు 8:3 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.
ఎస్తేరు 8:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎస్తేరు రాజు పాదాల మీద పడి ఏడుస్తూ, తిరిగి మనవి చేసింది. అగగీయుడైన హామాను యూదులకు విరుద్ధంగా చేసిన కీడు ప్రణాళికను భంగం చేయాలని వేడుకొంది.