ఎస్తేరు 6:6
ఎస్తేరు 6:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
హామాను లోపలికి వచ్చినప్పుడు, “రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను, “నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?” అని తనలో తాను అనుకున్నాడు.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 6ఎస్తేరు 6:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను “నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?” అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 6ఎస్తేరు 6:6 పవిత్ర బైబిల్ (TERV)
హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కారాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు. హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 6