Skip to content

ఎస్తేరు 5:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 5:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా

ఎస్తేరు 5 TELUBSI

ఎస్తేరు 5:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు.

ఎస్తేరు 5 IRVTEL

ఎస్తేరు 5:6 TERV (పవిత్ర బైబిల్)

వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.”

ఎస్తేరు 5 TERV

ఎస్తేరు 5:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు.

ఎస్తేరు 5 TSA