Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 2:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందుచేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు రాజు తన అధికారులందరికి, సేవకులందరికి ఎస్తేరు విషయమై గొప్పవిందు చేయించాడు. సంస్థానాలన్నిటిలో సెలవు ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:18 TERV (పవిత్ర బైబిల్)

మహారాజు ఎస్తేరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారులకూ పెద్ద విందు చేశాడు. అన్ని సామంత రాజ్యాల్యోనూ ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. ఉదారవంతుడైన ఆ మహారాజు జనానికి బహుమతులు పంపాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

రాజు తన సంస్థానాధిపతులు, అధికారులైన అందరికి ఎస్తేరు గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అతడు సంస్థానాలలో సెలవు ప్రకటించి రాజ ఔదార్యంతో వరాలు ఇచ్చాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA