Skip to content

ఎస్తేరు 1:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 1:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను.

ఎస్తేరు 1 TELUBSI

ఎస్తేరు 1:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది.

ఎస్తేరు 1 IRVTEL

ఎస్తేరు 1:5 TERV (పవిత్ర బైబిల్)

ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు.

ఎస్తేరు 1 TERV

ఎస్తేరు 1:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు.

ఎస్తేరు 1 TSA