ద్వితీయోపదేశకాండము 4:9
ద్వితీయోపదేశకాండము 4:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కళ్లారా చూసినవాటిని మరచిపోకుండా, మీరు జీవితాంతం మీ హృదయంలోనుండి చెరిగిపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు వారి తర్వాత వారి పిల్లలకు వాటిని బోధించండి.
ద్వితీయోపదేశకాండము 4:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి.
ద్వితీయోపదేశకాండము 4:9 పవిత్ర బైబిల్ (TERV)
కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి.
ద్వితీయోపదేశకాండము 4:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి