ద్వితీయోపదేశకాండము 33:29
ద్వితీయోపదేశకాండము 33:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”
ద్వితీయోపదేశకాండము 33:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
ద్వితీయోపదేశకాండము 33:29 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు. యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల మీద మీరు నడుస్తారు.”
ద్వితీయోపదేశకాండము 33:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.