ద్వితీయోపదేశకాండము 33:26-28 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 33:26-28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి– నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములోనుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
ద్వితీయోపదేశకాండము 33:26-28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
ద్వితీయోపదేశకాండము 33:26-28 TERV (పవిత్ర బైబిల్)
“ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు. మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు. నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం. శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీక్రింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు. ‘శత్రువును నాశనం చేయి’ అంటాడు. కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు, ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
ద్వితీయోపదేశకాండము 33:26-28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు, ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు, తన తేజస్సుతో మేఘాలపై వస్తారు. శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.