ద్వితీయోపదేశకాండము 28:11 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 28:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TSAద్వితీయోపదేశకాండము 28:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 IRVTELద్వితీయోపదేశకాండము 28:11 TERV (పవిత్ర బైబిల్)
“మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TERVద్వితీయోపదేశకాండము 28:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TELUBSI