ద్వితీయోపదేశకాండము 16:20 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 16:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.

ద్వితీయోపదేశకాండము 16:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి.

ద్వితీయోపదేశకాండము 16:20 TERV (పవిత్ర బైబిల్)

మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.

ద్వితీయోపదేశకాండము 16:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.