దానియేలు 3:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
దానియేలు 3:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.
దానియేలు 3:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అలా సాష్టాంగపడి నమస్కరించని వారిని వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారు.”
దానియేలు 3:6 TERV (పవిత్ర బైబిల్)
ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”
దానియేలు 3:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”