Skip to content

దానియేలు 3:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

దానియేలు 3:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధి క్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా

దానియేలు 3 TELUBSI

దానియేలు 3:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తరువాత నెబుకద్నెజరు తాను నిలబెట్టించిన విగ్రహ ప్రతిష్ఠకు దేశాల్లోని అధికారులను, ప్రముఖులను, సైన్యాధిపతులను, సంస్థానాల అధిపతులను, మంత్రులను, ఖజానా అధికారులను, ధర్మశాస్త్ర పండితులను, న్యాయాధిపతులను, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళను, ప్రజలందరినీ పిలవడానికి చాటింపు వేయించాడు.

దానియేలు 3 IRVTEL

దానియేలు 3:2 TERV (పవిత్ర బైబిల్)

ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధికారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు సమావేశపరచాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి రాజు వారందరిని పిలించాడు.

దానియేలు 3 TERV

దానియేలు 3:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తర్వాత రాజైన నెబుకద్నెజరు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ రావాలని ప్రకటించాడు.

దానియేలు 3 TSA