ఆమోసు 8:8 - Compare All Versions

ఆమోసు 8:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

షేర్ చేయి
ఆమోసు 8 TSA

ఆమోసు 8:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

షేర్ చేయి
ఆమోసు 8 IRVTEL

ఆమోసు 8:8 TERV (పవిత్ర బైబిల్)

ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది. దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు. ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది. భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”

షేర్ చేయి
ఆమోసు 8 TERV

ఆమోసు 8:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.

షేర్ చేయి
ఆమోసు 8 TELUBSI