Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:40 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.

అపొస్తలుల కార్యములు 9:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.

అపొస్తలుల కార్యములు 9:40 TERV (పవిత్ర బైబిల్)

పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది.

అపొస్తలుల కార్యములు 9:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్లను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది.