అపొస్తలుల కార్యములు 9:24 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి

అపొస్తలుల కార్యములు 9:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు.

అపొస్తలుల కార్యములు 9:24 TERV (పవిత్ర బైబిల్)

కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు.

అపొస్తలుల కార్యములు 9:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకున్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.