Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 8:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 8:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.

అపొస్తలుల కార్యములు 8:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు.

అపొస్తలుల కార్యములు 8:9 TERV (పవిత్ర బైబిల్)

సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలంనుండి మంత్రతంత్రాలు చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్పవాణ్ణని చెప్పుకొనేవాడు.

అపొస్తలుల కార్యములు 8:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కొంతకాలం నుండి ఆ పట్టణంలో మంత్రవిద్యను ప్రదర్శిస్తూ తానొక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ ప్రజలందరినీ ఆశ్చర్యపరచే, సీమోను అనే పేరు కలవాడు ఉన్నాడు.