Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:44 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.

అపొస్తలుల కార్యములు 7:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది.

అపొస్తలుల కార్యములు 7:44 TERV (పవిత్ర బైబిల్)

“మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు.

అపొస్తలుల కార్యములు 7:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది.