అపొస్తలుల కార్యములు 6:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 6:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి–మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.

అపొస్తలుల కార్యములు 6:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.

అపొస్తలుల కార్యములు 6:2 TERV (పవిత్ర బైబిల్)

అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు.

అపొస్తలుల కార్యములు 6:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు మిగిలిన విశ్వాసులందరిని ఒకచోటకు పిలిపించి వారితో, “మేము దేవుని వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేసి భోజన బల్లల గురించి కనిపెట్టుకొని ఉండడం సరికాదు.