అపొస్తలుల కార్యములు 5:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.

అపొస్తలుల కార్యములు 5:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 5:12 TERV (పవిత్ర బైబిల్)

అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు.

అపొస్తలుల కార్యములు 5:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచకక్రియలను, అద్భుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు.