అపొస్తలుల కార్యములు 4:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 4:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

అపొస్తలుల కార్యములు 4:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా.

అపొస్తలుల కార్యములు 4:9 TERV (పవిత్ర బైబిల్)

ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా?

అపొస్తలుల కార్యములు 4:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే