అపొస్తలుల కార్యములు 27:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 27:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.

అపొస్తలుల కార్యములు 27:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.

అపొస్తలుల కార్యములు 27:3 TERV (పవిత్ర బైబిల్)

మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు.

అపొస్తలుల కార్యములు 27:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మరుసటిరోజు మేము సీదోను పట్టణ ప్రాంతంలో దిగాం; యూలి శతాధిపతి పౌలు పట్ల దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తనకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు.