Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 26:13 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 26:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

అపొస్తలుల కార్యములు 26:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.

అపొస్తలుల కార్యములు 26:13 TERV (పవిత్ర బైబిల్)

సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశంనుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్నవాళ్ళ మీద ప్రకాశించింది.

అపొస్తలుల కార్యములు 26:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అగ్రిప్ప రాజా, ఇంచుమించు మధ్యాహ్న సమయంలో, నేను దారిలో ఉన్నప్పుడు, సూర్యుని కన్న ప్రకాశమైన వెలుగు పరలోకం నుండి వచ్చి నా చుట్టూ నాతో ఉన్న వారి చుట్టూ ప్రకాశించడం నేను చూశాను.