అపొస్తలుల కార్యములు 24:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 24:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.
అపొస్తలుల కార్యములు 24:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
అపొస్తలుల కార్యములు 24:24 TERV (పవిత్ర బైబిల్)
కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రుసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. “యేసు క్రీస్తులో విశ్వాసం” అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు.
అపొస్తలుల కార్యములు 24:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కలసి వచ్చాడు. అతడు పౌలును పిలిపించి యేసు క్రీస్తులోని విశ్వాసాన్ని గురించి అతడు బోధించిన మాటలను విన్నాడు.