అపొస్తలుల కార్యములు 23:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 23:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.

అపొస్తలుల కార్యములు 23:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు.

అపొస్తలుల కార్యములు 23:8 TERV (పవిత్ర బైబిల్)

సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు.

అపొస్తలుల కార్యములు 23:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు.