అపొస్తలుల కార్యములు 23:1 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 23:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 23:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 23:1 TERV (పవిత్ర బైబిల్)

పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు.

అపొస్తలుల కార్యములు 23:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.