Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 22:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 22:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.

అపొస్తలుల కార్యములు 22:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇంతవరకూ అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, “ఇలాటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండి” అని కేకలు వేశారు.

అపొస్తలుల కార్యములు 22:22 TERV (పవిత్ర బైబిల్)

ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు.

అపొస్తలుల కార్యములు 22:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పౌలు చెప్పిందంతా ఆ ప్రజలు విని, “వీనిని భూమి మీద ఉండకుండ చేయండి! ఇలాంటివాడు బ్రతుక కూడదు!” అని బిగ్గరగా కేకలు వేశారు.