అపొస్తలుల కార్యములు 20:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 20:20-21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.
అపొస్తలుల కార్యములు 20:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను.
అపొస్తలుల కార్యములు 20:20 TERV (పవిత్ర బైబిల్)
ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు.
అపొస్తలుల కార్యములు 20:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు.