అపొస్తలుల కార్యములు 18:24 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 18:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.

అపొస్తలుల కార్యములు 18:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.

అపొస్తలుల కార్యములు 18:24 TERV (పవిత్ర బైబిల్)

ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు.

అపొస్తలుల కార్యములు 18:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాల్లో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు.