అపొస్తలుల కార్యములు 18:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 18:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
అపొస్తలుల కార్యములు 18:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు.
అపొస్తలుల కార్యములు 18:12 TERV (పవిత్ర బైబిల్)
గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి
అపొస్తలుల కార్యములు 18:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు.