అపొస్తలుల కార్యములు 17:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 17:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

అపొస్తలుల కార్యములు 17:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 17:4 TERV (పవిత్ర బైబిల్)

తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కొంతమంది యూదులు ఒప్పింపబడి పౌలు సీలలతో చేరారు, అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవునికి భయపడే గ్రీసు దేశస్థులు, కొద్దిమంది ప్రముఖ స్త్రీలు కూడా చేరారు.