అపొస్తలుల కార్యములు 14:2-6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 14:2-6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించు చుండెను. పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొ స్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీదపడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి. వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపెట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
అపొస్తలుల కార్యములు 14:2-6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు. పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు. ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు. యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు. వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
అపొస్తలుల కార్యములు 14:2-6 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు. కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేసాడు. ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు. యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు. కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
అపొస్తలుల కార్యములు 14:2-6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని నమ్మని యూదులు, యూదేతరులను రేపి, సహోదరులకు విరోధంగా వారి మనస్సుల్లో ద్వేషాన్ని పుట్టించారు. అయినా పౌలు బర్నబాలు ప్రభువు కోసం ధైర్యంగా మాట్లాడుతూ చాలా కాలం అక్కడే ఉండి, ప్రభువు గురించి బోధిస్తూ ఉండగా, ప్రభువు వారి ద్వారా సూచకక్రియలను అద్భుతాలను చేయించి తన కృపా సందేశాన్ని రుజువుపరిచారు. ఆ పట్టణ ప్రజల్లో కొందరు యూదుల పక్షంగా మరికొందరు అపొస్తలుల పక్షంగా విడిపోయారు. యూదులు యూదేతరులు తమ నాయకులతో కలిసి, వారిని రాళ్లతో కొట్టి చంపాలని తలంచారు. కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడినుండి లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర దెర్బే పట్టణాలకు వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లి