అపొస్తలుల కార్యములు 13:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.
అపొస్తలుల కార్యములు 13:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
అపొస్తలుల కార్యములు 13:19 TERV (పవిత్ర బైబిల్)
కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు.
అపొస్తలుల కార్యములు 13:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు.