Skip to content

అపొస్తలుల కార్యములు 11:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 11:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.

అపొస్తలుల కార్యములు 11:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.

అపొస్తలుల కార్యములు 11:23 TERV (పవిత్ర బైబిల్)

అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 11:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.