అపొస్తలుల కార్యములు 10:47 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 10:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి
అపొస్తలుల కార్యములు 10:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి
అపొస్తలుల కార్యములు 10:47 TERV (పవిత్ర బైబిల్)
“వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.”
అపొస్తలుల కార్యములు 10:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు.