Skip to content

2 సమూయేలు 6:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 6:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

బయలుదేరి, కెరూబులమధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితోకూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.

2 సమూయేలు 6 TELUBSI

2 సమూయేలు 6:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ మందసాన్ని అక్కడి నుండి తీసుకు రావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి ముప్ఫై వేల మందిని సమకూర్చి బయలుదేరాడు.

2 సమూయేలు 6 IRVTEL

2 సమూయేలు 6:2 TERV (పవిత్ర బైబిల్)

దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు.

2 సమూయేలు 6 TERV

2 సమూయేలు 6:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యాల యెహోవా అని పిలువబడే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, అతనితో ఉన్న మనుష్యులందరు యూదాలోని బయలాకు వెళ్లారు.

2 సమూయేలు 6 TSA